: అఖిలేష్ యాదవ్ కు చుక్కెదురు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. తీవ్రవాద కేసుల ఉపసంహరణపై అలహాబాద్ కోర్టు స్టే విధించింది. గత ఎన్నికల్లో మైనార్టీల విశ్వాసాన్ని చూరగొనేందుకు సమాజ్ వాదీ పార్టీ తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్టు అరెస్టు చేసి జైలుజీవితం అనుభవిస్తున్న ముస్లిం యువకులపై కేసులను ఉపసంహరిస్తామంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ న్యాయవాది తీవ్రవాదులను రాజకీయ ప్రయోజనాల కోసం విడుదల చేస్తే దేశ భద్రతకు భరోసా ఏంటంటూ పిటీషన్ దాఖలు చేసారు. దీన్ని విచారించిన న్యాయస్థానం స్టే విధించింది. దీంతో అఖిలేష్ యాదవ్ కంగుతిన్నారు.