: త్వరలో ఎపీపీఎస్సీ నోటిఫికేషన్లు


రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పలు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏపీపీఎస్సీ ఇందుకోసం సన్నాహాలు చేస్తోంది. 11,250 ఉద్యోగాల భర్తీకి ఆర్ధికశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, వివిధ శాఖలను సమన్వయం చేసుకుని, ఈ నెలాఖరు నుంచి నోటిఫికేషన్లను విడుదల చేయనున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్, కార్యదర్శి చారుసిన్హా తెలిపారు. ఇప్పటికే తమవద్ద 3వేల పోస్టుల వివరాలు ఉన్నాయని, ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందువల్ల ఎన్నికల కోడ్ వీటికి వర్తించదని తెలిపారు. గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 బీగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసారి విడుదల చేయనున్న నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తింపజేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉందని బిస్వాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News