: శాస్త్రజ్ఞులను కలవరపెట్టిన ఉల్కాపాతం


ఇప్పుడు ప్రపంచంలోని ఖగోళ శాస్త్రజ్ఞులంతా పెద్ద చర్చలో మునిగిపోయారు. తమ కన్ను తప్పి నిన్న రష్యాలోని చెల్యాబింక్స్ పట్టణంలో బీభత్సం సృష్టించిన ఉల్కా శకలాలపాతంపై వీరు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎప్పుడో ఏళ్ల తర్వాత మన భూమికి చేరువగా వచ్చే చిన్న చిన్న గ్రహశకలాల గురించి ముందుగానే చెప్పేస్తున్న శాస్త్రవేత్తలు ఈ ఉల్కాపాతం గురించి ఎందుకు ముందుగా అంచనా వేయలేకపోయారన్నది ఇప్పుడు అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. శాస్త్రవేత్తలు కూడా మధనపడుతున్నారు.

పది టన్నుల బరువున్న ఈ ఉల్క శకలాలు భూమికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో పేలిపోయి ముక్కలు ముక్కలుగా నిన్న ఉదయం ఆ పట్టణం మీద పడ్డాయి. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ప్రళయం తమ ముందు ప్రత్యక్షం కావడంతో, ఆ పట్టణ వాసులు భయంతో వణికిపోయారు. తమ మీద ఏదో దేశం దండయాత్ర చేస్తోందేమో అని కూడా అనుమానించారు. ఉల్క శకలాలు ఇళ్ళ మీద పడడంతో సుమారు వెయ్యి మంది గాయపడ్డారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి, ఇది ఉల్కాపాతం అని టీవీలలో ప్రకటించేదాకా ప్రజలు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. ఈ ఘటనతో ఇప్పుడు శాస్త్రజ్ఞులు గ్రహశకలాల మీదే కాకుండా, ఉల్కాపాతాల మీద కూడా దృష్టి  పెడుతున్నారు.              

  • Loading...

More Telugu News