: 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు


మరో 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు.. తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అంతేకాక ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటున్నారు.

  • Loading...

More Telugu News