: నాదల్, సచిన్ కన్నా ధోనీయే రిచ్!


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫోర్బ్స్ జాబితాలో దూసుకుపోయాడు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వందమంది ఆటగాళ్లతో పత్రిక ఓ జాబితా తయారుచేసింది. ఇందులో భారత ఆటగాళ్ల నుంచి ధోనీ 16వ స్థానంలో నిలిచాడు. 31.5 డాలర్ల (దాదాపు 180 కోట్లు)తో పలువురు ఆటగాళ్లను వెనక్కు నెట్టాడీ మిస్టర్ కూల్. 2012లో 31వ స్థానంలో ఉన్న మహీ 15 స్థానాలు మెరుగుపరుచుకుని, ప్రస్తుత స్థానానికి చేరుకున్నాడని పత్రిక పేర్కొంది. ఈ మొత్తాన్ని ధోనీ బహుమతులు, వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్జించినట్లు తెలిపింది. ఇదే జాబితాలో 22 మిలియన్ల డాలర్ల(125 కోట్లు)తో సచిన్ టెండుల్కర్ 31వ స్థానంలో ఉన్నాడు.

ఇక ఈ జాబితాలో గోల్ఫర్ టైగర్ ఉడ్స్ 78.1 డాలర్లతో టాప్ ప్లేస్ లో ఉంటే, టెన్నిస్ ఆటగాడు ఫెదరర్ 71.5 డాలర్లతో తర్వాత స్థానంలో ఉన్నాడు. 61.9 డాలర్లతో అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు కోబే బ్ర్యాంట్ మూడో స్థానంలో నిలిచాడు. నోవాక్ డిజకోవిచ్ 28, రఫెల్ నాదల్ 30, ఉసేన్ బోల్ట్ 40వ స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలోనే టెన్నిస్ క్రీడాకారిణులు మరియా షరపోవా, సెరెనా విలియమ్స్, చైనా క్రీడాకారిణి లీనా ఉన్నారు.

  • Loading...

More Telugu News