: తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు


తెలంగాణ జిల్లాలు శీతాకాలంలో వర్షాకాలాన్ని చవి చూస్తున్నాయి. పలు చోట్ల నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. హైదరాబాదులో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లిలో వడగళ్ళ వాన కురిసి బీభత్సం సృష్టించింది.

ఖమ్మం నగర పరిసరాల్లో కూడా తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. నల్గొండ జిల్లా మిర్యాల గూడా ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కరీంనగర్ జిల్లా కూడా భారీ వర్షానికి గురైంది. ఈ అకాల వర్షాల వల్ల మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.          

  • Loading...

More Telugu News