: నేను తప్పు చేయలేదు: రాజ్ కుంద్రా
రాజ్ కుంద్రా తన జట్టు రాజస్థాన్ రాయల్స్ పై బెట్టింగులకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో రాజ్ కుంద్రా స్పందించాడు. దీనిపై తాను త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని చెప్పాడు. తానెటువంటి తప్పుకు పాల్పడలేదని, తనను నమ్మాలని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. మౌనంగా ఉంటే నేరం అంగీకరించినట్లు కాదని, నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు.