: కోర్టుకు చేరుకున్న జగన్, సబిత
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. చంచల్ గూడ జైలు నుంచి జగన్ ను బుల్లెట్ ప్రూఫ్ కారులో పోలీసులు తీసుకు వచ్చారు. మరోవైపు జగన్ కేసులో నాలుగవ నిందితురాలుగా ఉన్న సబిత ఇంటి నుంచి న్యాయస్థానానికి వచ్చారు. ఈ కేసులో మొదటిసారి ఆమె కోర్టుకు హాజరవుతున్నారు. కాగా, వీరిద్దరి రాక నేపథ్యంలో పోలీసులు గట్టి భధ్రత ఏర్పాటు చేయడంతో కోర్టు వద్ద నానా హంగామా జరుగుతోంది. జగన్ ను చూసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా తరలి వచ్చారు. అటు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి కూడా కోర్టుకు వచ్చారు.