: బెంగళూరులో రాకాసిబల్లి సందడి!
బెంగళూరులో ఆ రోడ్డుపై వెళ్ళే వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురౌతున్నారు. పిల్లలైతే 'అమ్మో... డైనోసార్' అంటూ కాస్త భయాందోళనలకు గురౌతున్నారు. దీని వల్ల ఇక్కడ ట్రాఫిక్ పెరిగే అవకాశముందని కొందరంటుంటే ... మరి కొంతమంది ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశముందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు వాటల్ నాగరాజు రోడ్డులోని సుజాత ధియేటర్ వద్ద ఓ ప్రముఖ టీవీ కంపెనీ ఏర్పాటు చేసిన భారీ డైనోసార్ ఫ్లెక్సీ దీనికి కారణమౌతోంది! ఇది జనాన్ని ఆకట్టుకోవడం సంగతలా ఉంచితే, ఇక్కడ వాహన చోదకులు దీని మీదే దృష్టి సారించి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని, దీన్ని తొలగించాలని చాలామంది కోరుతున్నారు.