: క్రికెటర్ వెంకటపతి రాజుకు అరుదైన గౌరవం
భారత మాజీ టెస్టు ఆటగాడు, హైదరాబాదు క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు వేంకటపతిరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆసియా క్రికెట్ మండలి (ACC) అభివృద్ధి అధికారిగా రాజును నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ACC లో ఐదుగురు సభ్యులు వుంటారు. వీరిలో వేంకటపతి రాజు ఒకరు. ఐసీసీ అసోసియేట్ దేశాలలో వీరు క్రికెట్ పాఠాలు నేర్పుతారు. ఆదివారం కౌలాలంపూర్ లో రాజు అధికార బాధ్యతలు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పదవి చేబట్టిన తొలి ఆటగాడు ఈయనే. ఇందుకు గాను ఆయనకు పెద్ద పారితోషికమే ముడుతుంది.