: జున్నుతో దంతాలు గట్టిపడతాయి!
ఇది నిజంగా పిల్లలకు ఆనందాన్ని కలిగించే వార్తే... ఎందుకంటే చక్కగా అమ్మతో చెప్పి ఇంత జున్ను తెప్పించుకుని తినేస్తే మీ పళ్లు గట్టిగా ఉంటాయని చెప్పండి. ఎంచక్కా అప్పుడు అమ్మ వాళ్లు వద్దనకుండా జున్ను తెచ్చి మనకు పెడతారు... అసలు జున్నే కాదు... పాలకు సంబంధించిన ఇతర ఉత్పత్తులు కూడా దంతాలను సంరక్షిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.
పాలతో తయారయ్యే జున్ను ఇంకా ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా మన దంతాల్లో రంధ్రాలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చని భారత సంతతికి చెందిన విపుల్ యాదవ్ నేతృత్వంలోని ఒక అధ్యయన బృందం కనుగొంది. మన దంతాల్లోని పీహెచ్ స్థాయి 5.5 ఫుట్స్ కంటే తక్కువగా ఉంటే దంతాలు కోతకు గురై వాటిపై రంధ్రాలు ఏర్పడే ప్రమాదముందని విపుల్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇతరత్రా పేస్టులపైనే ఆధారపడకుండా చక్కగా రోజూ కొద్దిగా జున్ను తెచ్చుకుని లాగించేయండి!