: పట్టుబిగించిన ధోనీ సేన
చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో.. ఓ దశలో గెలుపు దిశగా సాగుతోన్న దక్షిణాఫ్రికా జట్టును నిలువరించడంతో భారత బౌలర్లు సఫలమయ్యారు. బౌలర్లకు ఫీల్డర్ల మద్దతు తోడవడంతో సఫారీ జట్టు 33 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 33 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మూడో వికెట్ కు డివిలీర్స్ (70), రాబిన్ పీటర్సన్ (68) 124 పరుగులు జోడించి భారత్ గుండెల్లో గుబులు రేపినా.. పీటర్సన్ రనౌటవడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. దక్షిణాఫ్రికా జట్టు ఇక అక్కణ్ణుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కార్డిఫ్ లో జరుగుతున్న ఈ పోరులో టీమిండియా తొలుత 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.