: సీఎం కార్యదర్శిగా అజయ్ కల్లం నియామకం
సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం నియమితులయ్యారు. అజయ్ కల్లం ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈయన ఇంతకుముందు కూడా రాష్ట్రంలో పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు. కాగా, సీఎం కార్యాలయంలో ఇప్పటికే మరో ముఖ్యకార్యదర్శిగా వినయ్ కుమార్ ఉండగానే కల్లంను నియమించడం గమనార్హం.