: ఛత్తీస్ గఢ్ లో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
ఇటీవల కాంగ్రెస్ కాన్వాయ్ పై నక్సల్స్ దాడి చేసి పలువురిని పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో భద్రత దళాలు ఛత్తీస్ గఢ్ లో కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. సుకుమా జిల్లాలో బలింగ అటవీ ప్రాంతంలో పోలీసులు 113 జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.