: గాయానికి 'తీపి' కబురు


మన పెద్దలు చెప్పే చిట్కా వైద్యాలను తీసి పారేస్తాం కానీ... వాటి ముందు నేటి ఆధునాతన వైద్యం కూడా బలాదూరే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఉదాహరణకు ఇప్పటికీ మన పల్లెటూర్లలో ఎవరికైనా దెబ్బ తగిలితే ఆ కొట్టుకుపోయిన చోట పంచదార తెచ్చి అద్దుతారు. రక్తం కారుతున్నా కూడా అక్కడ పంచదార అద్దితే రక్తస్రావం తగ్గిపొతుంది. ఈ చిట్కా వైద్యం ఆఫ్రికాలో కూడా కొన్ని చోట్ల పాటిస్తారట.

జింబాబ్వేలో కొన్నేళ్ళ క్రితం మోసెస్ మురందు అనే పిల్లాడు ఆడుకుంటుంటే కాలికి పెద్ద గాయమైంది. అది చూసిన తండ్రి వెంటనే గుప్పెడు పంచదార తెచ్చి ఆ దెబ్బ మీద అదిమి కట్టుకట్టాడట. విచిత్రంగా మర్నాడికి అది తగ్గిపోయింది. ఆ కుర్రాడిలో ఆ సంఘటన బాగా నాటుకుపోయింది. కాలక్రమంలో ఆ అబ్బాయి లండన్లో ఉన్నత చదువులు చదివి, ఇప్పుడు ఆల్వార్ హాంప్టన్ యూనివెర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

చిన్నప్పుడు తండ్రి చేసిన పంచదార చిట్కా వైద్యం మీద పరిశోధనలు చేసి కొత్త విషయాలు కనుక్కున్నాడు. ఇంతకీ, అదేమిటంటే యాంటీ బయోటిక్స్ కంటే పంచదార బాగా పనిచేస్తుందని ప్రయోగ పూర్వకంగా ఆయన తేల్చాడు. చాలా మందికి ఇప్పుడాయన ఈ పంచదార వైద్యం చేస్తున్నాడు. ఇందులోని ఔషధ గుణాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి నడుం బిగించాడు.    

  • Loading...

More Telugu News