: ఊపిరి పీల్చుకున్న ఉత్తర భారతదేశం
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. రోజురోజుకు పెరుగుతోన్న వడదెబ్బ మృతులు.. ఈ విధంగా నెల్లాళ్ళ పాటు ఉత్తరభారత దేశం తీవ్రమైన ఎండలతో బెంబేలెత్తిపోయింది. ప్రజలు ఓ దశలో బయటకు రావాలంటేనే హడలిపోయారు. అంతగా ప్రభావం చూపాడు ప్రచండ భానుడు. అయితే, ఉత్తర భారత వాసులకు ఊరటనిస్తూ భారీ వర్షాలు పలకరించాయి. వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకానికి ఊరట కలిగించాయి.
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలను నేడు వరుణుడు కరుణించాడు. చల్లటి వాన జల్లుతో సేదదీర్చాడు. దీంతో, మొత్తమ్మీద ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు ఇక తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. గత కొద్ది వారాలుగా దేశ రాజధాని ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత స్థిరంగా నమోదైన సంగతి తెలిసిందే.