: దీటుగా బదులిస్తోన్న సఫారీలు
భారత్ విసిరిన సవాల్ కు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ దీటుగా స్పందించారు. ఇంగ్లండ్ లోని కార్డిఫ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో సఫారీలు 15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేశారు. రాబిన్ పీటర్సన్ (45 బ్యాటింగ్), కెప్టెన్ డివిలీర్స్ (39 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంకా 35 ఓవర్లలో 218 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి.