: చింపాంజీ తీసిన ఫొటోలకు యమ గిరాకీ!


మనిషి.. కోతి నుంచి పరిణామం చెందాడన్నది డార్విన్ సిద్ధాంతం. అందరికీ తెలిసిన విషయమే. కోతుల చేష్టలు మనిషి చేసే పనులకు దగ్గరగా ఉంటాయన్న సంగతీ విదితమే. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కూడా. మానవుల్లానే ఎంచక్కా పేలు చూసుకోవడం, ఆహారాన్ని స్వీకరించే విధానం ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, రష్యాకు చెందిన మిక్కీ అనే చింపాంజీ ఏకంగా కెమేరా చేతబట్టి ఫొటోలు తీసింది. వాటిని వేలంలో ఉంచగా రూ.43 లక్షల ధర పలికాయట. మాస్కోలోని రెడ్ స్క్వేర్ ను ఈ చింపాంజీ కెమేరాలో బంధించడం నిజంగా విశేషమే కదూ!

పాపం, తన ఫొటోలకు ఇంత గిరాకీ ఉందన్న విషయం తెలియకుండానే మిక్కీ కన్నుమూసింది. 2007లో ఆ చింపాంజీ మరణించింది. అది తీసిన ఛాయాచిత్రాలను ఇటీవల లండన్ లోని సౌత్ బీ వేలం కేంద్రంలో ప్రదర్శనకు ఉంచగా.. కిరా ఫ్లాంజాయిక్ అనే వ్యక్తి వాటిని దక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News