: ఐపీఎల్ తరహాలో ఫుట్ బాల్ లీగ్


ఐపీఎల్ విజయవంతం కావడంతో ఆ తరహాలో ఫుట్ బాల్ లోనూ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) నిర్ణయించింది. ఐఎంజీ-రిలయన్స్ సంస్థల సంయుక్త సౌజన్యంతో ఈ టోర్నీ నిర్వహిస్తారు. 2012లోనే ఈ లీగ్ ను జరుప తలపెట్టినా.. అప్పటికే ఐ-లీగ్ పేరిట మరో టోర్నీ జరుగుతుండడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. అయితే, ఐ-లీగ్ ఆదరణకు నోచుకోకపోవడంతో కొత్త టోర్నీని తెరమీదికి తేవాలని ఏఐఎఫ్ఎఫ్ భావిస్తోంది.

వచ్చే ఆగష్టులో ఆటగాళ్ళ వేలం ప్రక్రియ చేపడతారు. ఎన్ని జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. మొత్తమ్మీద ఎనిమిది నగరాల నుంచి జట్లు ఉండవచ్చిన సాకర్ వర్గాలంటున్నాయి. ఇక, ఈ తాజా లీగ్ కు మరింత వన్నెలద్దేందుకని.. డేవిడ్ బెక్ హామ్, థియరీ హెన్రీ, మైకేల్ ఓవెన్, రౌల్ గొంజాలెజ్ వంటి ఇంటర్నేషనల్ స్టార్లను భారత్ రప్పించేందుకు లీగ్ నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు.

  • Loading...

More Telugu News