: టీమిండియా అదుర్స్ 331/7
టీమిండియా తొలి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. కార్డిఫ్ లో జరిగిన తొలి మ్యాచ్ లో సాధికారక ఆటతీరుతో చెలరేగింది. సఫారీల పేస్ దాడిని తట్టుకుని 331 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఓపెనర్ గా రోహిత్ శర్మను బరిలోకి దించి ప్రయోగం చేసాడు ధోనీ. ఓపెనర్ గా రాణించిన రోహిత్ 65 పరుగులు చేసాడు. అతనికి జతగా 114 పరుగులను సాధించి సత్తా చాటాడు ధావన్.
అనంతరం వచ్చిన కోహ్లీ, ధోనీ కాస్త ఫర్వాలేదనిపించగా జడేజా 20 బంతుల్లో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు సాధించింది టీమిండియా. 3 వికెట్లు సాధించి మెక్ లారెన్ రాణించగా, 2 వికెట్లు తీసి అతనికి సోత్సొబే చక్కని సహకారమందించాడు. దీంతో 332 పరుగుల విజయలక్ష్యంతో సఫారీలు బ్యాటింగ్ కు దిగారు.