: అర్థాంగితో ప్రాబ్లం లేదంటున్న అల్లు అర్జున్
ఇటీవల విడుదలైన 'ఇద్దరమ్మాయిలతో..' సినిమా విశేషాలను కథానాయకుడు అల్లు అర్జున్ ఓ చానల్ తో పంచుకున్నాడు. లైవ్ షోలో అభిమానులతో ముచ్చటించాడు. పనిలోపనిగా భార్య స్నేహా రెడ్డి గురించి కూడా చెప్పాడు. తన సినిమాలు ఎలా ఉన్నా ఆమె బాగుందనే చెబుతుందని అన్నాడు. నటన గురించి ఎన్నడూ విమర్శించదని మురిపెంగా చెప్పాడు. పైగా, స్నేహకు కామెడీ ఇష్టమని, తన సినిమాల్లో మరికొంచెం కామెడీ ఉంటే బావుంటుందని సూచిస్తుందని వివరించాడీ స్టయిలిష్ స్టార్. అందుకే సినిమాల పరంగా భార్యతో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకొచ్చాడు.