: తిరుమల శ్రీవారి సేవలో రోశయ్య
తమిళనాడు గవర్నర్ రోశయ్య కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవరాలి పెళ్లి సందర్భంగా శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించిన రోశయ్య సామాన్య భక్తుల్లాగే జయ, విజయుల దగ్గర నుంచే స్వామి వారిని మహ లఘు దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తీర్థ ప్రసాదాలు అందించారు.