: సినీ తారలచే 'కన్యాశుల్కం' నాటక ప్రదర్శన
గురజాడ అప్పారావు రచించిన విఖ్యాత 'కన్యాశుల్కం' నాటకాన్ని ఈ నెల 16న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు. కీలకమైన మధురవాణి పాత్రలో టీవీ యాంకర్, సినీ నటి ఝాన్సీ నటించడం విశేషం. ఝాన్సీకి ఇదే తొలి నాటకం. అలాగే గిరీశం పాత్రలో హాస్య నటుడు ఉత్తేజ్ నటిస్తున్నారు. ఈ నాటకంలో లుబ్ధావధాన్లు పాత్రలో సీనియర్ నటుడు రాళ్లపల్లి నటిస్తున్నారు. సంగమం అకాడమీ నిర్వహిస్తున్న ఈ నాటకానికి శ్రీ దీక్షిత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా తారలు నటిస్తుండడంతో ఈ నాటాకానికి మంచి ప్రాచుర్యం లభిస్తోంది. ఈ నాటకాన్ని తిలకించడానికి పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే టికెట్లు కొనుక్కున్నారు.