: కోర్టు ఎదుట హాజరయిన కరీంనగర్ ఎంపీ
టీ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా కోర్టు ఎదుట హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైల్ రోకోలో పాల్గొనేందుకు వెళ్తోన్న పొన్నంపై గతంలో కేసు నమోదయింది. దీనికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ రోజు ఆయన న్యాయస్థానానికి వచ్చారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ బాధ్యత అని అన్నారు. ఏ వేదికనుంచైనా తెలంగాణకోసం పోరాడటం తన జన్మ హక్కన్నారు. కాగా, పలువురు తెలంగాణ విద్యార్ధులపై పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని గుర్తుచేశారు.