: కేకే తల నరుక్కుంటాడట!
ఇటీవలే టీఆర్ఎస్ పక్షాన చేరిన సీనియర్ నేత కె. కేశవరావు.. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నెలలోపు ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తే తల నరుక్కుంటానని శపథం చేశారు. కాంగ్రెస్ నేతలు నెలలో తెలంగాణ తెస్తామని ప్రచారం చేసుకుంటున్నారంటే హాస్యాస్పదంగా వుందని అన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలో నేడు జరిగిన టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ శిబిరంలో కేకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కాంగ్రెస్ వల్ల కాదని తేలాకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంపీ వివేక్ కూడా పాల్గొన్నారు.