: శ్రీధర్ బాబుకి బుద్దీ, జ్ఞానం లేదు: కేసీఆర్


మంత్రి శ్రీధర్ బాబుకి బుద్దీ, జ్ఞానం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో సీఎం, 'తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు ఖండించని తెలంగాణ కాంగ్రెస్ నేతల నోళ్లు నేడు లేస్తున్నాయని విమర్శించారు. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ సభలో కేసీఆర్ మాట్లాడుతూ గోదావరి వెంబడి 10 కొత్త విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి బొగ్గు గనుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతామన్నారు.

  • Loading...

More Telugu News