: పెంపుడు కుక్క మరణంతో విషాదంలో అమితాబ్ కుటుంబం
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం నేడు విషాదంలో మునిగిపోయింది. అమితాబ్ ఎంతో ప్రేమగా పెంచుకున్న 'షానౌక్' అనే శునకం నేడు అనారోగ్యంతో మరణించింది. పిరానా డేన్ జాతికి చెందిన ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత భారీ జాగిలం. అమితాబ్ తో జతగా 'షానౌక్' ఓ మ్యాగజైన్ ముఖచిత్రంపైన కూడా దర్శనమిచ్చింది.
కాగా, తన ప్రియనేస్తం మరణం పట్ల బిగ్ బి స్పందించారు. అది ఎంతో ప్రేమాస్పదమైన పెంపుడు జంతువని గుర్తు చేసుకున్నారు. ఉదరంలో తీవ్రస్థాయిలో నీరు చేరడంతో చనిపోయిందని ఆయన తెలిపారు. ఇంతకీ 'షానౌక్' అంటే అర్థం ఏమిటంటే.. 'శీతాకాలపు ప్రభాత వేళల్లో వీచే పిల్ల తెమ్మెర' అని. ఈ పేరును అభిషేక్ బచ్చన్ సూచించాడట!