: అయోధ్య అంశమే పార్టీ అజెండా కాదు : బీజేపీ
అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశంతో పార్టీ సాధారణ ఎన్నికలకు వెళ్లదని బీజేపీ స్పష్టం చేసింది. ఇదే పార్టీ అజెండా కాదని కూడా తెలిపింది. అయితే, అయోధ్య అంశానికి బీజేపీ ఎప్పటికీ సరైన ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ముస్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ధరల పెరుగుదల, అవినీతి, యూపీఏ పాలనలోని అక్రమాలపై ధ్వజమెత్తడమే తొలి ప్రాధాన్యమని చెప్పారు. కాగా, ఈ నెల 8, 9 తేదీల్లో గోవా రాజధాని పనాజీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం అక్కడికి చేరుకున్న నఖ్వీ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.