: జగన్ కేసులో రెండవ ఆస్తుల అటాచ్ మెంట్


వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ ప్రాధికార సంస్థ రెండవసారి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసులో సంబంధం వున్న రాంకీ ఫార్మా సిటీకి చెందిన 143.74 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఇందులో రూ.10 కోట్లను జగతి పబ్లికేషన్స్ లో రాంకీ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. ప్రతిఫలంగా గ్రీన్ బెల్ట్ తగ్గింపు ద్వారా రాంకీ మొత్తం 914 ఎకరాలు లబ్ది పొందింది. దీనిపై ఈ రోజు తీర్పు వెలువరించిన ఈడీ ప్రాధికార సంస్థ, రాంకీ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం సరైనదేనని పేర్కొంది. జనవరి 7న ఈడీ జగన్ కేసులో రాంకీ ఆస్తులను అటాచ్ చేసింది.

  • Loading...

More Telugu News