: ఇక చాలు, బంగాంరం కొనకండి: చిదంబరం
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.8 శాతానికి కట్టడి చేయడం సాధ్యమేనని కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి చిదంబరం తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం ఇఫ్పుడు అధికంగా ఉన్నప్పటికీ రబీ సమయానికి తగ్గిపోతుందని తెలిపారు. బంగారంపై పెట్టుబడులు తగ్గించేలా ఖాతాదారులకు సలహాలివ్వాలని సూచించారు. ప్రపంచంలో అత్యధికంగా 152 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, ఇది భవిష్యత్తుకు మంచిది కాదని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం చివరికి మరిన్ని కొత్త బ్యాంకులకు అనుమతులు వస్తాయని తెలిపారు. రూపాయి మారకం విలువ తగ్గడంపై ఆందోళన చెందొద్దని సూచించారు.