: అన్నా డీఎంకేలో చేరిన 'శృంగారతార' అనూరాధ


ఒకప్పుడు తన అందచందాలతో, మత్తెక్కించే విరుపులతో అభిమానులకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన శృంగారతార అనూరాధ రాజకీయాల్లో ప్రవేశించింది. తమిళనాట అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే.. ఈ నర్తకిని సాదరంగా ఆహ్వానించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో అనూరాధ.. సీఎం జయలలిత సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించింది. ఈ కార్యక్రమంలో అనూరాధ కుమార్తె అభినయశ్రీ కూడా పాల్గొంది. అభినయశ్రీ కూడా తల్లిబాటలోనే అభిమానులను సంతృప్తి పరిచేలా ఐటమ్ సాంగులతో ముందుకెళుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News