: రాజాభయ్యాపై లైడిటెక్టర్ కు అనుమతించండి: సీబీఐ


ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ అలియాస్ రాజాభయ్యాపై లైడిటెక్టర్ పరీక్షలకు అనుమతించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. కుందా డీఎస్పీ జియాఉల్ హక్ హత్యాకేసులో రాజాభయ్యా నిందితుడు. సీబీఐ గతనెల రెండు రోజులపాటు ఈయనని విచారించింది. కుందా డీఎస్పీ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో భయ్యాను కస్టడీలోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో అతన్ని పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతిస్తే కచ్చితంగా ఆధారాలు లభిస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. జియాఉల్ హక్ భార్య పర్వీన్ ఆజాద్ తన భర్త మరణం వెనుక రాజాభయ్యా హస్తం ఉందని చెబుతున్నారు. ఈ ఆరోపణల కారణంగానే రాజాభయ్యా తన మంత్రి పదవిని వదులుకోవాల్సివచ్చింది.

  • Loading...

More Telugu News