: సెలవు ప్రకటించిన మారుతి సుజుకీ


ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా తన కంపెనీకి ఒకరోజు సెలవు ప్రకటించింది. మార్కెట్లో డీజిల్ కార్ల అమ్మకాలు భారీగా పడిపోవడంతో ఈనెల 7న కార్ల కర్మాగారాన్ని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దాంతో గుర్ గావ్, మనే సార్ లోని ప్లాంట్లు శుక్రవారం నాడు మూతపడనున్నాయి. గత నెలలో మారుతి అమ్మకాలు 14 శాతం పడిపోగా, గత నాలుగు నెలలుగా కార్ల విక్రయాలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఇక ఈ నెల 17-22 మధ్య ద్వైవార్షిక నిర్వహణ కోసం సంస్థ అన్ని కర్మాగారాలను మూసివేయాలని అనుకుంటోంది. కాగా, గతంలో పెట్రోల్ కార్ల అమ్మకాలు కూడా దారుణంగా తగ్గడంతో ఇలాగే ఒకరోజు సంస్థకు సెలవు ప్రకటించింది మారుతి.

  • Loading...

More Telugu News