: తిరుమలలో భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం నిలిపివేత


వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలకు భక్తులు అధికంగా తరలి వస్తున్నారు. దీంతో దర్శనానికి చాలా సమయం తీసుకుంటోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచీ నిలిపివేశారు. ధర్మదర్శనంలో వెళ్లేవారికి 18 గంటల నుంచి 20 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 8 గంటల సమయం తీసుకుంటోంది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా.. వెలుపల కిలోమీటరు మేర భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.

  • Loading...

More Telugu News