: సత్తా చూపుతాం, కప్ గెలుస్తాం: ధోనీ
స్పాట్ ఫిక్సింగ్ మరకలతో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన టీమిండియా ఆ ప్రభావం జట్టుపై పడకుండా జాగ్రత్త పడింది. సన్నాహక మ్యాచ్ లలో అత్యుత్తమ ఫలితాలు సాధించి మంచి ఫాంలో ఉంది. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ , ఇర్ఫాన్ పఠాన్, ఉమేష్ యాదవ్, వినయ్ కుమార్ తో పేస్ విభాగం పటిష్టంగా ఉండగా , రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలతో స్పిన్ విభాగం వైవిధ్యంగా ఉంది. కాగా బ్యాటింగ్ లో సత్తా చాటేందుకు ధావన్, విజయ్ ఓపెనర్స్ గా రానుండగా... కోహ్లీ, రైనా, రోహిత్, కార్తిక్, ధోనీ వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్ తో పటిష్టంగా ఉంది. వీరిలో ఎవరైనా గాయపడితే తప్ప టీమిండియాను ఆపడం ప్రత్యర్ధుల వల్లకాదని ధోనీ అంటున్నాడు. టీమిండియా చక్కని బౌలింగ్, బ్యాటింగ్ వనరులతో అంతకంటే చక్కని మేళవింపుతో బలంగా ఉందని చెబుతున్నాడు. 'సత్తా చాటుతాం కప్పు గెలుస్తాం' అని భరోసా ఇస్తున్నాడు కెప్టెన్ ధోనీ.