: గెలుపుపై సఫారీల ధీమా


టీమిండియాను అడ్డుకునేందుకు సఫారీ పేస్ దాడిని ఆరంభించనుంది. గ్రూప్ బీలో మిగిలిన జట్లతో పోల్చుకుంటే టీమిండియాపై గెలిస్తే టైటిల్ గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయని సౌతాఫ్రికా కెప్టెన్ డివిలీర్స్ తెలిపాడు. ఆ జట్టుకు అరివీర భయంకర స్టెయిన్ ప్రధాన బలం. మోర్నీ మోర్కెల్, ట్సోట్సొబే తో సౌతాఫ్రికా బౌలింగ్ మరింత పదునుగా ఉంది. స్టెయిన్ పక్కటెముకల నోప్పితో బాధపడుతుండడం ప్రతికూలం. డివిలీర్స్, ఆమ్లా, డుమిని, పీటర్సన్ తో సఫారీల బ్యాటింగ్ కూడా బలంగానే ఉన్నప్పటికీ,స్మిత్, కలిస్ దూరంగా ఉండడం కూడా ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అయినప్పటికీ పేస్ విభాగంతో పాటూ ఫీల్డింగ్ లో రాణించి ఛాంపియన్ గా నిలబడతామని ధీమాగా ఉంది సఫారీ టీం. కెప్టెన్ డివిలీర్స్ మాట్లాడుతూ, టీమిండియాను అడ్డుకునేందుకు తమ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని, వాటిని మైదానంలో అమలు చేసి ఫలితం సాధిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News