: రాజ్ కుంద్రా నేరాంగీకారం.. అరెస్టుకు అవకాశం
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు అరెస్టవగా.. ఇప్పుడు ఆ జట్టు యజమాని, వ్యాపార వేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టుకు కూడా రంగం సిద్ధమైంది. ఐపీఎల్ లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ పై రాజ్ కుంద్రా బెట్టింగ్ లకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ధ్రువీకరించారు. గోయెంకా(ఉమేష్) అనే బుకీ ద్వారా రాజ్ కుంద్రా పందేలు కాశాడని, దీనివల్ల రాజ్ భారీగానే నష్టపోయాడని గుర్తించినట్లు నీరజ్ తెలిపారు. నేరం అంగీకరించినందున రాజ్ కుంద్రాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.