: గో మూత్ర గడియారం


మీ ఇంట్లో గడియారం ఉందా.. అందులో బ్యాటరీ అయిపోయిందా? అయితే గోమూత్రం తీసుకొచ్చి పోసేయండి, ఎంచక్కా పనిచేస్తుంది...! గోమూత్రానికి ఆయుర్వేద పరంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. పలు వ్యాధులను నయం చేస్తుందని చెబుతారు. కానీ, ఇదే గోమూత్రంతో గడియారాన్నీ పనిచేయించవచ్చని ఓ పరిశోధకుడు నిరూపించాడు. గుజరాత్ కు చెందిన హిరేన్ భాయ్ భేడా గొప్పతనమే ఇది. తాను రూపొందించిన ఆ గడియారాన్ని బుధవారం ముంద్ర తాలూకా, లూని గ్రామంలోని గోశాలలో ప్రదర్శించారు. రెండు గ్లాస్ జార్లు. ఒక్కో దానిలో లీటర్ గోమూత్రం. వాటి నుంచి గడియారానికి రెండు వైర్లు. అంతే అది ఎంచక్కా పనిచేస్తుంది. ఒకసారి కష్టపడి మీరు రెండు లీటర్ల గోమూత్రం సంపాదిస్తే నెలపాటు ఆ గడియారానికి ఇంధనం అక్కర్లేదు. మరి జార్లు సిద్ధం చేసుకోండి.

  • Loading...

More Telugu News