: రజనీకాంత్ కన్నా వందరెట్లు ఆమే సింపుల్ అట!
తమిళ నటుడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దల్లుడన్న సంగతి అందరికీ తెలిసిందే. రజనీ పెద్ద కూతురు ఐశ్వర్యే అతడి భార్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గురించి ధనుష్ మాట్లాడుతూ.. తన మామ, సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నా ఐశ్వర్య వందరెట్లు సింపుల్ గా ఉంటుందని కితాబిచ్చాడు. ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆమె సమానంగా చూస్తుందని చెప్పాడు. ఐశ్వర్య ఇద్దరు కొడుకులను పెంచి పెద్దచేయడంలో మంచి తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోందని తెగ పొగిడేశాడు.