: డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేస్తాం: పార్ధసారధి
డీఎస్సీ-2012 ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ డీఎస్సీ అభ్యర్ధులు చేస్తున్న ఆందోళనకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి స్పందించారు. చట్టపరిధిలోనే అభ్యర్ధులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని నేటి సాయంత్రం జరిగే కేబినెట్ మీటింగులో చర్చిస్తానని తెలిపారు. మంత్రి స్పందనతో హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ పై చేస్తున్న ఆందోళనను అభ్యర్ధులు విరమించనున్నారని సమాచారం.