: రెప్ప పాటులో గొంతుకోసి పరారు
ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. కనీసం పదిమందిలో ఉన్నా కాస్త నిశ్చింతగా ఉందామనుకున్నా అక్కడా రక్షణ కరవే. కిరాతకులు ఎక్కడపడితే అక్కడే దుశ్చర్యలకు తెగబడుతున్నారు. రెప్పపాటులో హత్యలు చేసి పరారవుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా బస్టాండ్ లో అందరూ చూస్తుండగా ఫ్లాట్ ఫాంపై ఆగి ఉన్న బస్సులోని ఓ వ్యక్తి గొంతుకోసి పారిపోయారు అగంతకులు. దీంతో స్థానికులు అతడ్ని 108లో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గొంతుపై లోతుగా గాయమవడంతో అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అతడ్ని రెడ్డీస్ ల్యాబ్ లో ఉద్యోగి రమేష్ గా గుర్తించారు.