: 10 నుంచి అసెంబ్లీ భేటీ
ఈనెల 10వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ఆర్ధికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. 21 వరకు 12 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లోనే రాష్ట్ర బడ్జెట్ ను సభ్యులు ఆమోదించనున్నట్లు చెప్పారు. నెల్లూరు నగరంలోని పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆనం మీడియాకు ఈ విషయాలు వెల్లడించారు.