: కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలది: మంత్రి గంటా
కాంగ్రెస్ పార్టీ ఎవరినీ టార్గెట్ చేయదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగరంలోని వైఎస్సార్ పార్కులో ఉడా నిర్మించిన వాకింగ్ పార్క్ ను ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన, దళిత వర్గాలకు చెందినదని ఆయన స్పష్టం చేసారు. మంత్రి వర్గంలో మూడు పదవులు ఖాళీగా ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత మంత్రి వర్గపునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలిపారు.