: రాజ్ కుంద్రా పాస్ పోర్టు స్వాధీనం
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా పాస్ పోర్టును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారణ పూర్తయ్యేంత వరకు దేశాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు. కాగా, ఫిక్సింగ్ వ్యవహారంలో కుంద్రాను, అతడి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి ఉమేశ్ గోయెంకాను ఢిల్లీ పోలీసులు నిన్న 12 గంటల పాటు విచారించారు. జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడినట్లే యజమాని అయిన కుంద్రా కూడా ఇందులో పాలు పంచుకున్నారా? అనే కోణంలో ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. అయితే కుంద్రా విషయంలో అప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు.