: ఇక ఇంటినుండే అన్నీ కొనుక్కోవచ్చు...!


మనం ఇంటినుండే ఏమైనా కొనుక్కోవచ్చు... అయితే మీకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. ఎందుకంటే, ఈ కొనుగోలు ఆన్‌లైన్లో జరుగుతుంది కాబట్టి. అంతర్జాతీయంగా పేరొందిన రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌.కామ్‌ సంస్థ ఇప్పటికే భారత్‌ ఇ-కామర్స్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ఇప్పటి వరకూ ఈ సంస్థ కేవలం పుస్తకాలు, సినిమాలను మాత్రమే విక్రయించేది. ఇప్పుడీ సంస్థ తన ఆన్‌లైన్‌ సేవలను మరింతగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకనుండి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా కెమెరాలను, మొబైల్‌ ఫోన్లను కూడా అమ్మకాలు చేయనుంది. ఈ విషయం గురించి అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ భారతదేశంలో ఇ-కామర్స్‌ ఇప్పుడే ప్రారంభదశలో ఉందని, ఇక్కడ తమకు గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ షాపింగ్‌ ద్వారా వినూత్నతతోబాటు వినియోగదారులకు మంచి ఉత్పత్తులను అందించేందుకు మరిన్ని అవకాశాలుంటాయని ఆయన అన్నారు.

ఈ కంపెనీ గత ఏడాదే జంగ్లీ.కామ్‌ పేరిట ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం తాజాగా రూపొందుతున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌తోబాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సంస్థ ఈ రెండింటిపైన కూడా దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టనున్నట్టు తెలిపారు. కాగా, భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానంలో మినహాయింపును ఇవ్వాల్సిందిగా సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ పాల్‌ ఇ మిసేనర్‌ కోరారు. మూడు నెలల అనంతరం అమెజాన్‌ కంపెనీ నుండి ఇలాంటి ప్రకటన వెలువడడం విశేషం.

  • Loading...

More Telugu News