: నగర జీవనం ప్రమాదభరితం!


నగర జీవనం ప్రమాదభరితమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నగరాల్లోని వాతావరణం మనుషుల జీవనాన్నే కాదు, ఇతర పశుపక్ష్యాదుల జీవనాన్ని కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోందని గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిజానికి నగరాల్లో కలుషిత వాతావరణం ఎక్కువగా ఉంటుంది. గాలి, నీరు కూడా ఇక్కడ కలుషితమైనవే ఉంటాయి. ఇలాంటి వాతావరణం సహజంగానే మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీన్ని గుర్తించే నగర జీవన విధానం అక్కడ నివసించే మనుషుల, పశువుల, పక్షుల ఆయు:ప్రమాణాన్ని దెబ్బతీస్తుందని వారు అంటున్నారు. నగరాల్లో పరుగులతో కూడిన జీవన విధానం ఉంటుందని, దానికి అనుగుణంగా వారి జీవ చర్యావృత్తి కూడా పూర్తిగా మారుతుందని దీని ఫలితం మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు పట్టణ ప్రాంతాల్లోను, పల్లె ప్రాంతాల్లోను నివశించే వారిలోని జీవ ప్రక్రియలను పరిశీలించారు. అలాగే జర్మనీకి చెందిన పక్షి శాస్త్రవేత్తలు దక్షిణ జర్మనీ ప్రాంతంలోని కొన్ని రకాల పక్షులను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనానికి వారు తేలికగా ఉండే రేడియో ట్రాన్స్‌మీటర్లను అమర్చారు. వీటి ద్వారా పక్షుల దైనందిన జీవన విధానాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో నగరజీవనం తాలూకు విష పరిణామాల ప్రభావం వాటిపై స్పష్టంగా తెలుస్తోందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News