: బుల్లెట్‌ రైలు వేగం చాలా ఎక్కువ!


ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ రైలు వెళుతుంది. దీని వేగం ఎంతో తెలుసా...? గంటకు 500 కిలోమీటర్లు. ఇంతటి వేగంతో దూసుకుపోగల రైలు ప్రపంచంలో ఇదే మొదటిదేమో. ఈ బుల్లెట్‌ రైలును జపాన్‌ దేశం ఆవిష్కరించింది. ఇది గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగల అయస్కాంత చలన వేగాన్ని కలిగి ఉంటుంది. జపాన్‌లోని యమనషీ ప్రాంతంలో మధ్య జపాన్‌ రైల్వే ఎల్‌0 మోడల్‌ను పట్టాలపై ఇటీవలే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మరింత పూర్తిస్థాయి పరీక్షలకు వీలుగా ఈ పట్టాలను ప్రస్తుతం 43 కిలోమీటర్ల పరిధికి విస్తరించనున్నారు.

ఈ రైలు పూర్తిస్థాయిలో వాణిజ్యపరంగా 2027 నాటికి టోక్యో-నగోయాల మధ్య తిరుగనుంది. ఈ బులెట్‌ రైలు నగోయా నుండి టోక్యోకు కేవలం 40 నిముషాల్లో చేరుకుంటుందని న్యూస్‌ఆన్‌జపాన్‌.కామ్‌ పేర్కొంది. ఈ రైలు సేవలు 2045 నాటికల్లా ఒసాకా వరకూ విస్తరించాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆ దేశానికి చెందిన మీడియా వెల్లడించింది.

  • Loading...

More Telugu News