: దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఆవిష్కరణ
బీహారు రాజధాని పాట్నాలో మహాత్మా గాంధీ 70 అడుగుల పొడవైన భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆవిష్కరించారు. బాపూజీకి ఇరువైపులా ఇద్దరు చిన్నారులతో నిలబడి ఉండేలా చేసిన ఈ కాంస్య విగ్రహాన్ని రూపొందించేందుకు 10 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ విగ్రహం ఏర్పాటుతో ఢిల్లీ పార్లమెంటు ఆవరణలో ధ్యానముద్రలో ఉన్నట్లుండే గాంధీ విగ్రహం, దేశంలో రెండో పెద్ద విగ్రహం అయింది.