: చేప ప్రసాదంపై లోకాయుక్త తీర్పు
ఉబ్బస వ్యాధిని నయం చేస్తామంటూ బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త నేడు తీర్పు ఇచ్చింది. చేప ప్రసాదం పంపిణీకి అయ్యే ఖర్చును బత్తిన సోదరులే భరించాలని పేర్కొంది. ప్రభుత్వం కల్పించే అన్ని వసతులకు రుసుం చెల్లించాలని కూడా లోకాయుక్త ఆదేశించింది. బత్తిన సోదరులు ప్రజలను మోసం చేస్తున్నారంటూ జనవిజ్ఞానవేదిక దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన లోకాయుక్త పైవిధంగా తీర్పునిచ్చింది.
ఈ సందర్భంగా లోకాయుక్త చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి హైదరాబాద్ లో మాట్లాడుతూ, ఈ చేప ప్రసాదానికి శాస్త్రీయత లేదన్నారు. దీన్ని మందుగా పరిగణించడం కుదరదని చెబుతూ, ప్రభుత్వం కూడా ఈ పంపిణీ కార్యక్రమానికి సహకారం అందించడం అంధవిశ్వాసాలను ప్రోత్సహించడమే అని వ్యాఖ్యానించారు.