: 'మంత్రి శ్రీధర్ బాబు అవినీతి పరుడు'
మంత్రి శ్రీధర్ బాబు అవినీతి పరుడంటూ పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసారు. మంత్రి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. డీఎస్ఆర్ సొల్యూషన్స్ పేరుతో మంత్రి ప్రభుత్వ సొమ్మును కాజేశారని తెలిపారు. తన ఫిర్యాదులో కాగ్ నివేదికను కూడా ప్రస్తావించారు. శ్రీధర్ బాబుకు చెందిన కంపెనీలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. కేవలం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి ఊరుకోకుండా తన బ్లాగులో కూడా ఆ వివరాలను పొందుపరిచారు.